సిరీస్‌పై భారత మహిళల దృష్టి
ABN , First Publish Date - 2021-07-14T08:45:32+05:30 IST
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌తో ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది.
ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20 నేడు
చెమ్స్‌ఫోర్డ్: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌తో ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య 1-1తో ప్రస్తుతం సిరీస్ సమంగా ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే ఈ నిర్ణాయక మ్యాచ్‌లో మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ విజేతగా నిలవాలనుకుంటోంది. అదే జరిగితే హర్మన్‌ప్రీత్ సేన 2019 తర్వాత టీ20 సిరీస్ గెలిచి నట్టవుతుంది. సోనీ నెట్‌వర్క్‌లో రాత్రి 11 గం. నుంచి ఈ మ్యాచ్ మొదలవుతుంది.