దీప్తి, సుష్మపై ఆశలు

ABN , First Publish Date - 2021-03-14T06:08:20+05:30 IST

ఐదు వన్డేల సిరీస్‌లో వెనకబడిన భారత మహిళలు విజయమే లక్ష్యంగా నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో ఈ మ్యాచ్‌ జరగనుంది...

దీప్తి, సుష్మపై ఆశలు

  • దక్షిణాఫ్రికాతో భారత మహిళల నాలుగో వన్డే నేడు 
  • ఉ.9 గం.నుంచి స్టార్‌స్పోర్ట్స్‌ 2 లో..

లఖ్‌నవ్‌: ఐదు వన్డేల సిరీస్‌లో వెనకబడిన భారత మహిళలు విజయమే లక్ష్యంగా నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో ఈ మ్యాచ్‌ జరగనుంది. తొలి వన్డేలో చిత్తయిన మిథాలీసేన రెండో మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకొని గెలుపొందింది. తద్వారా 1-1తో సిరీ్‌సను సమం చేసింది. కానీ మూడో వన్డేలో ఆ జోరు కొనసాగించ లేకపోయింది. దాంతో దక్షిణాఫ్రికా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ముఖ్యంగా చివరి 10 ఓవర్లలో ఽభారత్‌ ధాటిని కనబరచలేకపోతోంది. ఇందుకు జట్టులో పవర్‌ హిట్టర్లు లేకపోవడం కారణం. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ, వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ సుష్మా వర్మపై భారత్‌ భారీగా ఆశలుపెట్టుకుంది. పూనమ్‌ రౌత్‌, స్మృతి, మిథాలీ, హర్మన్‌ప్రీత్‌ టాప్‌, మిడిల్డార్‌లో సత్తా చాటాలి. చివర్లో దీప్తి, సుష్మ వారికి తోడైతే భారత్‌కు విజయం  కష్టం కాబోదు.

Updated Date - 2021-03-14T06:08:20+05:30 IST