అమ్మాయిల్ని ప్రేమించొద్దంటున్న భారత క్రికెటర్
ABN , First Publish Date - 2021-11-04T21:55:17+05:30 IST
సెలెబ్రిటీల విషయాలను గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. క్రికెటర్లు, సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూడటమంటే ఈ ఆసక్తి ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది.
సెలెబ్రిటీల విషయాలను గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. క్రికెటర్లు, సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూడటమంటే ఈ ఆసక్తి ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. సోషల్ మీడియాలో వారు చేసే చిన్న పోస్ట్ కూడా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంటుంది. తాజాగా భారత క్రికెటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్ నెట్టింట హల్ చల్ చేయడం మొదలెపెట్టింది. దీంతో నెటిజన్లు నీ గర్ల్ ఫ్రెండ్ తో బ్రేక్ ఆప్ అయిందా అని అడుగుతున్నారు.
ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) టీమ్‌కు శుభ్‌మన్‌గిల్ ఆడుతున్న సంగతి క్రికెట్ అభిమానులకు తెలిసిందే. అతడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. అమ్మాయిలతో ఎప్పుడు కూడా ప్రేమలో పడకండి అని అతడు పెట్టిన పోస్ట్ నెట్టింట్లో హల్చల్ చేయడం మొదలైంది. నీ గర్ల్ ఫ్రెండ్‌తో బ్రేక్ఆప్ అయిందా అని నెటిజన్లలందరూ క్రికెటర్ని అడగడం మొదలుపెట్టారు.
ఈ క్రికెటర్ గత కొంత కాలంగా సచిన్ టెండూల్కర్ కూతురైన సారా టెండూల్కర్‌తో డేటింగ్ చేస్తున్నట్టుగా వదంతులు వినిపిస్తున్నాయి. శుభ్‌మన్ గిల్, అతడి సోదరిలను సారా టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో గత కొంతకాలంగా ఫాలో అవుతోంది. ఒకరు పెట్టిన పోస్టులకు మరొకరు లైక్, కామెంట్ కూడా చేస్తుంటారు. అతడు పెట్టిన పోస్టుతో వారిద్దరి మధ్య బ్రేక్ఆప్ అయినట్టు అభిమానులందరూ భావిస్తున్నారు.