భారత ఒలింపిక్ సైన్యం ఇదే..
ABN , First Publish Date - 2021-07-04T09:14:00+05:30 IST
కరోనాతో ఏడాది పాటు వాయిదా పడిన ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడలకు కౌంట్‌డౌన్ ఆరంభమైంది. ఈ నెల 23 నుంచి టోక్యోలో జరిగే క్రీడలకు భారత్ నుంచి ఇప్పటివరకు 18 క్రీడల్లో 115 మంది అథ్లెట్లు అర్హత సాధించారు...
- బరిలో 115 మంది
- ఫెన్సింగ్‌లో తొలిసారి
కరోనాతో ఏడాది పాటు వాయిదా పడిన ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడలకు కౌంట్‌డౌన్ ఆరంభమైంది. ఈ నెల 23 నుంచి టోక్యోలో జరిగే క్రీడలకు భారత్ నుంచి ఇప్పటివరకు 18 క్రీడల్లో 115 మంది అథ్లెట్లు అర్హత సాధించారు. ఇందులో ఫెన్సింగ్ నుంచి తొలిసారి ప్రాతినిధ్యం కనిపించబోతోంది. కఠిన పోటీని తట్టుకుంటూ ఈ వేదికపై అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. సగర్వంగా ఒలింపిక్ పతకాన్ని అందుకోవాలని వీరంతా ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా పీవీ సింధు, నీరజ్ చోప్రా, దీపికా కుమారి, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగట్, అమిత్ పంగల్, మేరీ కోమ్ ఇలా కొందరిపై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఇప్పటిదాకా 31 ఒలింపిక్ క్రీడల్లో భారత్‌కు 28 పతకాలు వచ్చాయి. మరోవైపు మనదేశం తరపున టోక్యోకు వెళ్లనున్న ఆటగాళ్ల వివరాలను రెండు భాగాలుగా పరిశీలిద్దాం. ఈ జాబితాలోని కొన్ని క్రీడాంశాల వివరాలను చూద్దాం...రండి!
అథ్లెటిక్స్ (19 మంది)
పురుషుల జావెలిన్ త్రో: నీరజ్ చోప్రా, శివ్‌పాల్ సింగ్
పురుషుల లాంగ్ జంప్: మురళి శ్రీశంకర్
పురుషుల షాట్‌పుట్: తజిందర్‌పాల్ సింగ్ తూర్
మహిళల డిస్కస్ త్రో: కమల్‌ప్రీత్ కౌర్, సీమా పూనియా
మహిళల జావెలిన్ త్రో: అన్నూ రాణి
పురుషుల 400మీ. హర్డిల్స్: ఎంపీ జబీర్
పురుషుల 4గీ400మీ. రిలే: మహమ్మద్ అనాస్ యహియా, నోహా
నిర్మల్ టామ్, అమోజ్ జాకబ్, అరోకియా రాజీవ్.
పురుషుల 20కి.మీ రేస్ వాక్: సందీప్ కుమార్, రాహుల్ రోహిలా,
ఇర్ఫాన్ కొలోత్తుమ్ తోడి.
పురుషుల 3000మీ. స్టీపుల్‌చేజ్: అవినాశ్ సబ్లే
మహిళల 100మీ.: ద్యూతీ చంద్
మహిళల 200మీ.: ద్యూతీచంద్
మహిళల 20కి.మీ రేస్ వాక్: ప్రియాంక గోస్వామి, భావనా జాట్
మిక్స్‌డ్ 4గీ400మీ. రిలే: మహమ్మద్ అనాస్ యహియా, నోహా నిర్మల్ టామ్, వీకే విస్మయ, జిస్నా మాథ్యూ
ఆర్చరీ (4)
పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం: అతాను దాస్, తరుణ్ దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్. పురుషుల టీమ్ ఈవెంట్‌లోనూ ఈ త్రయమే పాల్గొంటుంది.
మహిళల వ్యక్తిగత రికర్వ్: దీపికా కుమారి
మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్: దీపిక-అతాను
బ్యాడ్మింటన్ (4)
మహిళల సింగిల్స్: పీవీ సింధు
పురుషుల సింగిల్స్: సాయి ప్రణీత్
పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి
బాక్సింగ్ (9)
పురుషుల 52కేజీ ఫ్లయ్‌వెయిట్: అమిత్ పంగల్
పురుషుల 63కేజీ లైట్‌వెయిట్: మనీశ్ కౌశిక్
పురుషుల 69కేజీ వెల్టర్‌వెయిట్: వికాస్ క్రిషన్
పురుషుల 75కేజీ మిడిల్‌వెయిట్: ఆశీష్ కుమార్
పురుషుల 91కేజీ సూపర్ హెవీవెయిట్: సతీశ్ కుమార్
మహిళల 51కేజీ ఫ్లయ్‌వెయిట్: మేరీ కోమ్
మహిళల 60కేజీ ఫ్లయ్‌వెయిట్: సిమ్రన్‌జిత్ కౌర్
మహిళల 69కేజీ వెల్టర్‌వెయిట్: లవ్లీనా బొర్గోహేన్
మహిళల 75కేజీ మిడిల్‌వెయిట్: పూజా రాణి
ఈక్వెస్ట్రియన్ (1) ఫౌవాద్ మీర్జా
ఫెన్సింగ్ (1) మహిళల సబ్రే: సీఏ భవానీ దేవి
గోల్ఫ్ (3)
పురుషుల వ్యక్తిగత: అనిర్బన్ లాహిరి, ఉదయన్ మనే
మహిళల వ్యక్తిగత: అదితి అశోక్
జిమ్నాస్టిక్స్ (1)
మహిళల వాల్ట్: ప్రణతి నాయక్