ICC T20 World Cup: టాస్ గెలిచిన కోహ్లీ

ABN , First Publish Date - 2021-11-06T00:42:58+05:30 IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా స్కాట్లాండ్‌తో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో టీమిండియా సారథి కోహ్లీ టాస్ గెలిచి

ICC T20 World Cup: టాస్ గెలిచిన కోహ్లీ

దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా స్కాట్లాండ్‌తో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో టీమిండియా సారథి కోహ్లీ టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు రెండింటిలో ఓడిపోయి సెమీస్ అవకాశాలను సంక్షిష్టం చేసుకుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత జట్టు సెమీస్‌కు చేరుకోవడం దాదాపు అసాధ్యం.


ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిన పసికూన స్కాట్లాండ్ ఇందులోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, ఈ రోజు నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్ గ్రూప్ 2లో రెండో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. థర్డ్ స్పిన్నర్ కోసం శార్దూల్ స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు. స్కాట్లాండ్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.

Updated Date - 2021-11-06T00:42:58+05:30 IST