రెండో టీ20లో టీమిండియా ఘన విజయం

ABN , First Publish Date - 2021-03-15T04:08:03+05:30 IST

రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. తొలి టీ20లో ఓటమిని రెండో మ్యాచ్‌లో విజయంతో సమం చేసింది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఛేజింగ్‌లో టీమిండియాకు భారీ ఓపెనింగ్ దక్కింది. మొదట సున్నా పరుగులకే ..

రెండో టీ20లో టీమిండియా ఘన విజయం

అహ్మదాబాద్: రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. తొలి టీ20లో ఓటమిని రెండో మ్యాచ్‌లో విజయంతో సమం చేసింది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 165 పరుగుల ఛేజింగ్‌లో టీమిండియాకు భారీ ఓపెనింగ్ దక్కింది. మొదట సున్నా పరుగులకే కేఎల్ రాహుల్ డకౌట్ అయినా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(56: 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు)తో వీర విహారం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. అతడికి కెప్టెన్ విరాట్ కోహ్లీ*(73: 49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు) కూడా తోడవడంతో టార్గెట్‌ ఛేజింగ్ మరింత సులభమైంది. తొలి టీ20లో డకౌట్ అయినప్పటికీ రెండో మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ అదరగొట్టాడు. అజేయ అర్థ సెంచరీతో భారత్‌కు విజయాన్ని అందించాడు. వీరితో పాటు 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రిషబ్ పంత్(26: 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) కూడా మెరుపులు మెరిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్‌లు తలో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2021-03-15T04:08:03+05:30 IST