సౌతాఫ్రికాతో తొలి టెస్టు.. నిలకడగా ఆడుతున్న భారత్

ABN , First Publish Date - 2021-12-26T21:18:49+05:30 IST

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో మొదలైన తొలి టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి

సౌతాఫ్రికాతో తొలి టెస్టు.. నిలకడగా ఆడుతున్న భారత్

సెంచూరియన్: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో  మొదలైన తొలి టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ఎలాంటి తడబాటు లేకుండా నిదానంగా  ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు పెంచుకుంటూ పోతోంది. రబడ, లుంగి ఎంగిడి వంటి సీనియర్ బౌలర్లను కేఎల్ రాహుల్, మాయాంక్ అగర్వాల్ సమర్థంగా ఎదుర్కొంటున్నారు.  లంచ్ బ్రేక్ సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. అగర్వాల్ 46, రాహుల్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-12-26T21:18:49+05:30 IST