3rd T20I: ఎనిమిదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
ABN , First Publish Date - 2021-11-22T03:55:43+05:30 IST
3rd T20I: ఎనిమిదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

కోల్‌కతా: మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 185 పరుగుల భారీ విజయ లక్ష్యంతో న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగింది. మ్యాచ్ ఆరంభంలోనే న్యూజిలాండ్ తడబడింది. బౌలర్ అక్సర్ పటేల్ తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌కు షాకిచ్చాడు. 21 పరుగుల వద్ద ఓపెనర్ డరిల్ మిచెల్ (5).. అక్సర్ పటేల్ బౌలింగులో హర్షల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మార్క్ చాప్‌మన్ డకౌట్ అయ్యాడు. 10.3 ఓవర్ల వద్ద న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. మార్టిన్ గుప్టిల్ 36 బంతుల్లో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. 4.4 ఓవర్ల వద్ద న్యూజిలాండ్ 30 పరుగులు చేసి మూడో వికెట్ కోల్పోయింది. అక్సర్ పటేల్ వేసిన నాలుగు బంతులను ఎదుర్కొని గ్లెన్ ఫిలిప్స్ ఒక పరుగు కూడా చేయకుండా ఔటయ్యాడు. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి మార్టిన్ గుప్టిల్ ఔటయ్యాడు. 15.1 ఓవర్ల వద్ద న్యూజిలాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.