చెన్నై టెస్ట్: లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 355/3

ABN , First Publish Date - 2021-02-06T17:32:05+05:30 IST

చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు ధాటిగా ఆడుతోంది

చెన్నై టెస్ట్: లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 355/3

చెన్నై: చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు ధాటిగా ఆడుతోంది. లంచ్ బ్రేక్ సమయానికి 119 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. క్రీజులో జోరూట్(156 బ్యాటింగ్), బెన్ స్టోక్స్(63 బ్యాటింగ్) ఉన్నారు.


263/3 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లీష్ టీమ్.. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటోంది. జో రూట్, బెన్ స్టోక్స్ ఇద్దరూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో 112వ ఓవర్‌లో జో రూట్ 150 పరుగులు పూర్తి చేసుకోగా... 113వ ఓవర్‌లో బెన్ స్టోక్ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 


రికార్డుల వీరుడు జో రూట్  వరుస టెస్టుల్లో 150కి పైగా పరుగులు చేసిన వారి జాబితాలో చేరాడు. వరుసగా నాలుగు టెస్టుల్లో 226, 228, 186, 150(నాటౌట్)  పరుగులు చేశాడు. 

Updated Date - 2021-02-06T17:32:05+05:30 IST