ముంబై మురిసె..

ABN , First Publish Date - 2021-03-14T06:18:03+05:30 IST

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎ్‌సఎల్‌) టైటిల్‌ను ముంబై సిటీ పుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ముంబై 2-1తో పటిష్ఠమైన ఏటీకే మోహన్‌ బగాన్‌ క్లబ్‌ చిత్తుచేసి తొలిసారి టైటిల్‌ అందుకుంది...

ముంబై మురిసె..

  • తొలిసారి ఐఎస్‌ఎల్‌ టైటిల్‌ కైవసం
  • ఫైనల్లో మోహన్‌ బగాన్‌పై గెలుపు

మర్గావ్‌: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎ్‌సఎల్‌) టైటిల్‌ను ముంబై సిటీ పుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ముంబై 2-1తో పటిష్ఠమైన ఏటీకే మోహన్‌ బగాన్‌ క్లబ్‌ చిత్తుచేసి తొలిసారి టైటిల్‌ అందుకుంది. 90వ నిమిషంలో గోల్‌ చేసిన బిపిన్‌ సింగ్‌ ముంబైని విజేతగా నిలిపాడు. 18వ నిమిషంలో డేవిడ్‌ విలియమ్స్‌ మొదటి గోల్‌ చేసి బగాన్‌ను ఆధిక్యంలో నిలిపాడు. అయితే 29వ నిమిషంలో ఏటీకే డిఫెండర్‌ జోస్‌ టిరి సెల్ఫ్‌ గోల్‌తో ముంబై 1-1తో స్కోరు సమం చేసింది. ఈ టైటిల్‌తో ముంబై..ఏషియన్‌ చాంపియన్స్‌ లీగ్‌ బెర్త్‌ దక్కించుకుంది.

Updated Date - 2021-03-14T06:18:03+05:30 IST