రోహిత్ కూడా అవుట్.. కష్టాల్లోకి భారత్

ABN , First Publish Date - 2021-11-01T01:44:39+05:30 IST

కివీస్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా క్రమంగా కష్టాల్లోకి జారుకుంటోంది.

రోహిత్ కూడా అవుట్.. కష్టాల్లోకి భారత్

దుబాయ్: కివీస్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా క్రమంగా కష్టాల్లోకి జారుకుంటోంది. 11 పరుగుల వద్ద ఇషాన్ వికెట్‌ను కోల్పోయిన భారత్.. 35  పరుగుల వద్ద కేఎల్ రాహుల్‌ (18)ను చేజార్చుకుంది. సిక్సర్, ఫోర్ బాది దూకుడుగా కనిపించిన రోహిత్ శర్మ కూడా ఆ తర్వాత కాసేపటికే పెవిలియన్ చేరాడు. 14 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. సోధి బౌలింగ్‌లో సిక్స్‌కు ప్రయత్నించి గప్టిల్‌కు చిక్కాడు. టీమిండియా వరుసపెట్టి వికెట్లు కోల్పోతుండడంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం కెప్టెన్ కోహ్లీ, రిషభ్ పంత్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం జట్టు భారం మొత్తం వీరిమీదే ఉంది. 9 ఓవర్లు పూర్తయ్యాయి. టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. 

Updated Date - 2021-11-01T01:44:39+05:30 IST