ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన ఇండియా

ABN , First Publish Date - 2021-12-20T01:19:00+05:30 IST

త్వరలో జరగనున్న అండర్ 19 ప్రపంచకప్‌కు 17 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది

ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన ఇండియా

ముంబై: త్వరలో జరగనున్న అండర్ 19 ప్రపంచకప్‌కు 17 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు కరీబియన్ కంట్రీ వెస్టిండీస్‌లో టోర్నీ జరగనుంది. అండర్ 19 భారత జట్టుకు ఢిల్లీ బ్యాట్స్‌మన్ యష్ దుల్‌ సారథ్యం వహిస్తాడు. ఎస్‌కే రషీద్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 


ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా 48 మ్యాచుల్లో పోటీ పడతాయి. నాలుగుసార్లు చాంపియన్ అయిన భారత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. 2000, 2008, 2012, 2018లలో భారత జట్టు అండర్ 19 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2016, 2020లో రన్నరప్‌గా నిలిచింది. 

Updated Date - 2021-12-20T01:19:00+05:30 IST