అన్షుకొత్త చరిత్ర

ABN , First Publish Date - 2021-10-07T09:13:20+05:30 IST

అన్షూ మాలిక్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో ప్రవేశించడం ద్వారా ఈ ఘనత అందుకున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా నిలిచింది. బుధవారం జరిగిన మహిళల 57 కి. సెమీ్‌సలో 19 ఏళ్ల అన్షు సాంకేతిక ఆధిపత్యంతో

అన్షుకొత్త చరిత్ర

  • వరల్డ్‌ రెజ్లింగ్‌లో ఫైనల్‌కు 
  • ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళ


ఓస్లో (నార్వే): అన్షూ మాలిక్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో ప్రవేశించడం ద్వారా ఈ ఘనత అందుకున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా నిలిచింది. బుధవారం జరిగిన మహిళల 57 కి. సెమీ్‌సలో 19 ఏళ్ల అన్షు సాంకేతిక ఆధిపత్యంతో యూరోపియన్‌ జూ.చాంపియన్‌ సోలోమిలా వినిక్‌ (ఉక్రెయిన్‌)ని చిత్తు చేసింది. ఫైనల్‌కు చేరడంతో అన్షుకు రజత పతకం ఖాయం. కాగా గీతా ఫొగట్‌ (2012), బబితా ఫొగట్‌ (2012), పూజా దండా (2018), వినేశ్‌ ఫొగట్‌ (2019) మాత్రమే భారత్‌ తరపున ప్రపంచ పోటీల్లో కాంస్య పతకాలు నెగ్గారు. ఇక 59 కిలోల సెమీఫైనల్లో సవితా మోర్‌ 0-3తో యూరోపియన్‌ చాంపియన్‌ జ్వికోవా చేతిలో ఓడింది. దాంతో ఇప్పుడిక సవిత కాంస్యం కోసం తలపడనుంది. సెమీ్‌సకు చేరే క్రమంలో మోర్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌కు షాకిచ్చింది. 

Updated Date - 2021-10-07T09:13:20+05:30 IST