ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. టాప్‌లో పంత్

ABN , First Publish Date - 2021-01-20T19:01:11+05:30 IST

బ్రిస్బేన్‌ టెస్ట్ చరిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ... తన కెరీర్‌లో అత్యుత్తమ టెస్ట్ ర్యాంక్ సాధించాడు.

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. టాప్‌లో పంత్

దుబాయ్: బ్రిస్బేన్‌ టెస్ట్ చరిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ... తన కెరీర్‌లో అత్యుత్తమ టెస్ట్ ర్యాంక్ సాధించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి ఎగబాకాడు. వికెట్ కీపర్లలో  తొలి స్థానం అతనిదే. నాలుగో టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్‌లో పంత్ చేసిన 89 పరుగులు టీమిండియాను విజయతీరాలకు చేర్చాయి. దీంతో 33 ఏళ్ల రికార్డు బద్దలైంది. గత మూడు దశాబ్దాలుగా గాబ స్టేడియంలో తిరుగులేని ఆసీస్‌ను టీమిండియా ఓడించడం సరికొత్త చరిత్రను సృష్టించింది. పంత్ తర్వాత దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ నిలిచాడు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 15 స్థానం సంపాదించిన డికాక్.. వికెట్ కీపర్‌గా రెండో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, టీమిండియా ఆటగాళ్లలో శుభమన్ గిల్ 68వ స్థానం నుంచి 47వ స్థానానికి, పుజార 17వ స్థానానికి, సిరాజ్ 45వ స్థానానికి చేరారు.   


ఇక ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ 4వ స్థానానికి పడిపోయాడు. ఆసీస్ బ్యాట్స్‌మన్ లబుషేన్ మూడో స్థానంలో ఉన్నాడు. 

Updated Date - 2021-01-20T19:01:11+05:30 IST