టీవీలో సచిన్‌ను చూసి నేర్చుకున్నా

ABN , First Publish Date - 2021-06-10T10:08:03+05:30 IST

స్ట్రయిట్‌ డ్రైవ్‌ ఎలా ఆడాలో లిటిల్‌ మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను టీవీలో చూసి నేర్చుకున్నానని భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పాడు...

టీవీలో సచిన్‌ను చూసి నేర్చుకున్నా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): స్ట్రయిట్‌ డ్రైవ్‌ ఎలా ఆడాలో లిటిల్‌ మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను టీవీలో చూసి నేర్చుకున్నానని భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పాడు. క్రికెట్‌ కోచింగ్‌కు సంబంధించిన ‘క్రికురు’ అనే యాప్‌ను మాజీ క్రికెటర్‌ సంజయ్‌ బంగర్‌తో కలిసి వర్చువల్‌ విధానంలో సెహ్వాగ్‌ బుధవారం ఆవిష్కరించాడు. ఆన్‌లైన్‌లో క్రికెట్‌ కోచింగ్‌ ఇవ్వాలనే లక్ష్యంతో సెహ్వాగ్‌ ప్రారంభించిన ఈ క్రికురు యాప్‌లో అతడితో పాటు వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా, క్రిస్‌ గేల్‌, ఏబీ డివిల్లీర్స్‌, బ్రెట్‌లీ వంటి హేమాహేమీలు వర్థమాన క్రికెటర్లకు పాఠాలు చెప్పనున్నారు. ఆవిష్కరణ వేడుకలో సెహ్వాగ్‌ మాట్లాడుతూ 1992 వరల్డ్‌కప్‌ సమయంలో సచిన్‌ ఆట టీవీలో చూసేవాడినని.. స్ట్రయిట్‌ డ్రైవ్‌ ఆడడం సచిన్‌ను చూసే తాను నేర్చుకున్నానని తెలిపాడు. 


Updated Date - 2021-06-10T10:08:03+05:30 IST