బట్లర్, శాంసన్ పరుగుల వర్షం.. ఉరుకుతున్న రాజస్థాన్ స్కోరు

ABN , First Publish Date - 2021-05-02T22:23:22+05:30 IST

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ దాటిగా ఆడుతోంది. ఓపెనర్ జోస్ బట్లర్‌, కెప్టెన్ సంజు

బట్లర్, శాంసన్ పరుగుల వర్షం.. ఉరుకుతున్న రాజస్థాన్ స్కోరు

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ దాటిగా ఆడుతోంది. ఓపెనర్ జోస్ బట్లర్‌, కెప్టెన్ సంజు శాంసన్‌లు స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. 17 పరుగుల వద్ద యశస్వి (12) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్‌తో కలిసి ఇన్సింగ్స్‌ను నిలబెట్టిన బట్లర్.. క్రీజులో కుదురుకున్నాక విశ్వరూపం చూపించాడు. బౌలర్లపై యథేచ్ఛగా విరుచుకుపడుతూ సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు శాంసన్ కూడా క్రీజులో నిలదొక్కుకున్నాక బ్యాట్ ఝళింపించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిశాయి. రాజస్థాన్ వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. బట్లర్ 91, శాంసన్ 47 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2021-05-02T22:23:22+05:30 IST