హైదరాబాద్‌ ఓటముల్లో హ్యాట్రిక్‌

ABN , First Publish Date - 2021-12-15T07:12:38+05:30 IST

విజయ్‌ హజారే వన్డే ట్రోఫీలో చామ మిలింద్‌ (6/63) అదరగొట్టినా హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ ఓటమిని తప్పించుకోలేకపోయింది...

హైదరాబాద్‌ ఓటముల్లో హ్యాట్రిక్‌

చంఢీగడ్‌: విజయ్‌ హజారే వన్డే ట్రోఫీలో చామ మిలింద్‌ (6/63)  అదరగొట్టినా హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ ఓటమిని తప్పించుకోలేకపోయింది. మంగళవారం గ్రూప్‌-సిలోని జార్ఖండ్‌తో తలపడిన హైదరాబాద్‌ 36 పరుగులతో ఓడింది. తొలుత జార్ఖండ్‌ 50 ఓవర్లలో 276 రన్స్‌కు ఆలౌటైంది. విరాట్‌ సింగ్‌ (65) అర్ధ సెంచరీతో రాణించాడు. మిలింద్‌ డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేసి జార్ఖండ్‌ను కట్టడి చేశాడు. ఛేదనలో తన్మయ్‌ (59), రాహుల్‌ (45) తప్ప అంతా విఫలమవడంతో హైదరాబాద్‌ 48.4 ఓవర్లలో 240 రన్స్‌కే పరిమితమైంది.

Updated Date - 2021-12-15T07:12:38+05:30 IST