హాకీ దిగ్గజం దత్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-07-08T09:19:32+05:30 IST

రెండు ఒలింపిక్‌ పతకాలు నెగ్గిన భారత హాకీ దిగ్గజం, 95 ఏళ్ల కేశవ్‌ దత్‌ అనారోగ్య కారణాలతో బుధవారం తుదిశ్వాస విడిచాడు. 1948 లండన్‌ ఒలింపిక్స్‌, 1952 హెల్సింకి విశ్వక్రీడల్లో...

హాకీ దిగ్గజం దత్‌ కన్నుమూత

న్యూఢిల్లీ: రెండు ఒలింపిక్‌ పతకాలు నెగ్గిన భారత హాకీ దిగ్గజం, 95 ఏళ్ల కేశవ్‌ దత్‌ అనారోగ్య కారణాలతో బుధవారం తుదిశ్వాస విడిచాడు. 1948 లండన్‌ ఒలింపిక్స్‌, 1952 హెల్సింకి విశ్వక్రీడల్లో భారత జట్టు స్వర్ణం సాధించడంలో దత్‌ కీలకపాత్ర పోషించాడు. కేశవ్‌ మృతితో ఓ శకం ముగిసిందని హాకీ ఇండియా అధ్యక్షుడు జ్ఞానేంద్రో నిన్‌గోబమ్‌ అన్నాడు. దత్‌ మృతిపట్ల బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. మోహన్‌ బగాన్‌ హాకీ జట్టుకు కేశవ్‌ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 2019లో మోహన్‌ బగాన్‌ రత్న అవార్డును అందుకున్న తొలి నాన్‌ ఫుట్‌బాలర్‌ దత్‌. 

Updated Date - 2021-07-08T09:19:32+05:30 IST