హరి, హారిక గేమ్‌లు డ్రా

ABN , First Publish Date - 2021-11-02T08:42:46+05:30 IST

ఫిడే గ్రాండ్‌ స్విస్‌ టోర్నీలో పెంటేల హరికృష్ణ ఆరోరౌండ్‌ను డ్రాగా ముగించాడు.

హరి, హారిక గేమ్‌లు డ్రా

(లాత్వియా): ఫిడే గ్రాండ్‌ స్విస్‌ టోర్నీలో పెంటేల హరికృష్ణ ఆరోరౌండ్‌ను డ్రాగా ముగించాడు. సోమవారం మథియాస్‌ (జర్మనీ)తో జరిగిన ఈ గేమ్‌ను హరికృష్ణ డ్రా చేసుకున్నాడు. ఇక,  ఆరో రౌండ్‌లో ద్రోణవల్లి హారిక గేమ్‌ కూడా డ్రాగా ముగిసింది. బట్సియా ష్విలి (రష్యా)తో గేమ్‌ను హారిక ఫలితం లేకుండా ముగించింది. ఆరో రౌండ్‌ అనంతరం హారిక నాలుగు పా యింట్లతో, హరికృష్ణ 3.5 పాయింట్లతో ఉన్నారు. కాగా, అర్జున్‌ ఇరిగేసి ఐదో రౌండ్‌లో రష్యా గ్రాండ్‌ మాస్టర్‌ అలెగ్జాండ్రాపై విజయం సాధించాడు. 

Updated Date - 2021-11-02T08:42:46+05:30 IST