మరో అధ్యాయం ఎదురుచూస్తోంది

ABN , First Publish Date - 2021-12-26T09:17:22+05:30 IST

విజయవంతమైన క్రికెట్‌ కెరీర్‌ ముగించిన భర్త హర్భజన్‌ సింగ్‌ను అతడి భార్య గీతా బస్రా అభినందించింది. ‘నువ్వు అనుకున్న విధంగా ఆటకు వీడ్కోలు పలకలేపోయావు. కానీ విధి మన చేతుల్లో

మరో అధ్యాయం ఎదురుచూస్తోంది

హర్భజన్‌ భార్య గీత భావోద్వేగ పోస్ట్‌


న్యూఢిల్లీ: విజయవంతమైన క్రికెట్‌ కెరీర్‌ ముగించిన భర్త హర్భజన్‌ సింగ్‌ను అతడి భార్య గీతా బస్రా అభినందించింది.  ‘నువ్వు అనుకున్న విధంగా ఆటకు వీడ్కోలు పలకలేపోయావు. కానీ విధి మన చేతుల్లో ఉండదు కదా! ధైర్యం, అభిరుచి, దూకుడు కలగలిసి నువ్వు క్రికెట్‌ ఆడావు. నీకోసం మరో అధ్యాయం ఎదురుచూస్తోంది. అందులో విజయం కలగాలి ప్రియతమా’ అని గీత భావోద్వేగంతో ట్వీట్‌ చేసింది.

నేడు విజయ్‌ హజారే ఫైనల్‌

జైపూర్‌: తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌ జట్ల మధ్య ఆదివారం విజయ్‌ హజారే ట్రోఫీ ఫైనల్‌ జరుగనుంది. ఈ సీజన్‌ ఆరంభంలో ముస్తాక్‌ అలీ ట్రోఫీని గెలుచుకున్న తమిళనాడు ఈ పోరులోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 


Updated Date - 2021-12-26T09:17:22+05:30 IST