లార్డ్స్‌ టెస్టుకు దాదా

ABN , First Publish Date - 2021-08-10T08:53:54+05:30 IST

ఇంగ్లండ్‌తో జరగబోయే రెండో టెస్టు కోసం భారత క్రికెట్‌ జట్టు లండన్‌ వెళ్లింది. ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో ఈనెల 12 నుంచి మ్యాచ్‌ జరుగుతుంది.

లార్డ్స్‌ టెస్టుకు దాదా

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరగబోయే రెండో టెస్టు కోసం భారత క్రికెట్‌ జట్టు లండన్‌ వెళ్లింది. ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో ఈనెల 12 నుంచి మ్యాచ్‌ జరుగుతుంది. వీరందరికీ అంతకుముందే ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహించారు. అయితే ఇటీవలే జట్టుతో చేరిన సూర్యకుమార్‌, పృథ్వీ షా 10రోజుల క్వారంటైన్‌ 13న పూర్తవుతుంది. అంతవరకు వీరు నాటింగ్‌హామ్‌లోనే ఉంటారు. మరోవైపు భారత్‌ నుంచి విమాన ప్రయాణ ఆంక్షలను బ్రిటన్‌ సడలించడంతో.. లార్డ్స్‌ టెస్టును తిలకించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మంగళవారం లండన్‌ వెళ్లనున్నాడు.

Updated Date - 2021-08-10T08:53:54+05:30 IST