ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గడం నావల్ల కాదు!

ABN , First Publish Date - 2021-05-20T08:45:57+05:30 IST

తానిక ఫ్రెంచ్‌ ఓపెన్‌ను గెలుచుకునే అవకాశాల్లేవని రోజర్‌ ఫెడరర్‌ భావిస్తున్నాడు. ఏడాదిన్నరగా క్లే కోర్టుకు దూరంగా ఉం డడం, తగినంత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడమే అందుకు కారణ మని 39 ఏళ్ల ఫెడెక్స్‌...

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గడం నావల్ల కాదు!

జెనీవా: తానిక ఫ్రెంచ్‌ ఓపెన్‌ను గెలుచుకునే అవకాశాల్లేవని రోజర్‌ ఫెడరర్‌ భావిస్తున్నాడు. ఏడాదిన్నరగా క్లే కోర్టుకు దూరంగా ఉం డడం, తగినంత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడమే అందుకు కారణ మని 39 ఏళ్ల ఫెడెక్స్‌ విశ్లేషించాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ముందు క్లే కోర్టులో జరిగిన స్విస్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన నేపథ్యంలో ఫెడరర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో నేనాడిన ప్రదర్శనతో ఫ్రెంచ్‌ ఓపె న్‌ను ఎలా నెగ్గగలనని భావిస్తా ను? నేను వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తున్నా. గడచిన 50 ఏళ్ల ఫ్రెంచ్‌ ఓపెన్‌ చరిత్రలో 40 ఏళ్ల ఆటగాడు అద్భుతాలు చేసి న దాఖలాలు లేవు’ అని ఫెడెక్స్‌ స్పష్టం చేశాడు.


Updated Date - 2021-05-20T08:45:57+05:30 IST