మానసిక ఆందోళనతో ఆటకు విరామం

ABN , First Publish Date - 2021-12-08T09:13:50+05:30 IST

మానసిక ఆందోళన.. కొంతకాలంగా ఆటగాళ్లను వేధిస్తున్న సమస్య ఇది. ఆ మధ్య ఇదే కారణంతో ప్రపంచ టెన్నిస్‌ మాజీ నెంబర్‌వన్‌

మానసిక ఆందోళనతో ఆటకు విరామం

వాషింగ్టన్‌: మానసిక ఆందోళన.. కొంతకాలంగా ఆటగాళ్లను వేధిస్తున్న సమస్య ఇది. ఆ మధ్య ఇదే కారణంతో ప్రపంచ టెన్నిస్‌ మాజీ నెంబర్‌వన్‌ క్రీడాకారిణి నవోమి ఒసాక కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. తాజాగా మరో చాంపియన్‌ ఇదే బాటను అనుసరించింది. 2019 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌, కెనడా నెంబర్‌వన్‌ క్రీడాకారిణి బియాంక ఆండ్రెస్కూ కొన్నిరోజులు ఆట నుంచి విశ్రాంతి తీసుకుంటున్నానని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ‘అనేక వారాలు ఐసొలేషన్‌లో ఉండడంతో శారీరకంగా, మానసికంగా ఎంతో ఆందోళనకు గురయ్యా. ఇప్పటికిప్పుడు కోర్టులో ఆడేందుకు సిద్ధంగా లేను’ అని 21 ఏళ్ల బియాంక ట్వీట్‌ చేసింది. 

Updated Date - 2021-12-08T09:13:50+05:30 IST