ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కన్నుమూత
ABN , First Publish Date - 2021-02-07T00:36:58+05:30 IST
ఆస్ట్రేలియా మాజీ లెఫ్టార్మ్ పేసర్ శామ్ గనాన్ నేడు (శనివారం) కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ లెఫ్టార్మ్ పేసర్ శామ్ గనాన్ నేడు (శనివారం) కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. వరల్డ్ సిరీస్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తొలి టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహంచిన శామ్ మూడు టెస్టులు ఆడాడు. శామ్ 1977లో తన హోం గ్రౌండ్ అయిన వాకాలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ టెస్టులో శామ్ ఏడు వికెట్లు పడగొట్టాడు. 40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన శామ్ 30.47 సగటుతో 117 వికెట్లు పడగొట్టాడు. 1978-79 సీజన్‌లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
రిటైర్మెంట్ తర్వాత శామ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (వాకా) వైస్ చైర్మన్‌గా, చైర్మన్‌గా దశాబ్దకాలానికిపైగా పనిచేశాడు. 2017లో శామ్ ‘మెడల్ ఆఫ్ ది ఆర్డర్’ అందుకున్నాడు. శామ్ మరణవార్త తమను బాధించిందని, ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ పేర్కొన్నారు.