15 ఓవర్లకు ఇంగ్లండ్ ఎన్ని పరుగులు చేసిందంటే..

ABN , First Publish Date - 2021-03-15T02:00:38+05:30 IST

ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టీ20లో 15 ఓవర్లు పూర్తయ్యాయి. మొత్తం 90 బంతుల్లో ఇంగ్లీష్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌లో జోస్ బట్లర్(0) డకౌట్ కాగా.. ..

15 ఓవర్లకు ఇంగ్లండ్ ఎన్ని పరుగులు చేసిందంటే..

అహ్మదాబాద్: ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టీ20లో 15 ఓవర్లు పూర్తయ్యాయి. మొత్తం 90 బంతుల్లో ఇంగ్లీష్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌లో జోస్ బట్లర్(0) డకౌట్ కాగా.. మరో ఓపెనర్ జేసన్ రాయ్(46) తొలి టీ20లోలానే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ ఈ సారి కూడా అర్థ సెంచరీ అందుకోలేకపోయాడు. 46 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి మిడ్‌ఆన్‌లో భువనేశ్వర్‌ కుమార్‌కు చిక్కాడు. వన్‌డౌన్‌లో వచ్చిన డేవిడ్ మలాన్(24) కూడా త్వరగానే అవుటయ్యాడు. ఆ తరువాత క్రీజులోకొచ్చిన బెయిర్ స్టో(20)ను వాషింగ్టన్ సుందర్ తన తొలి బంతికే పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్ క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-03-15T02:00:38+05:30 IST