ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్.. భారత్‌పై భారీ ఆధిక్యం

ABN , First Publish Date - 2021-08-27T21:36:39+05:30 IST

మొత్తానికి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ ఆతిథ్య ఇంగ్లిష్ జట్టు 432 పరుగులకు..

ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్.. భారత్‌పై భారీ ఆధిక్యం

లీడ్స్: మొత్తానికి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఇంగ్లిష్ జట్టు 432 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత కంటే 354 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 423/8తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 8 పరుగులు మాత్రమే జోడించి తొమ్మిదో వికెట్ కోల్పోగా, మరో పరుగు జోడించి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీకి నాలుగు వికెట్లు దక్కగా బుమ్రా, సిరాజ్, జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

Updated Date - 2021-08-27T21:36:39+05:30 IST