లంచ్ బ్రక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు ఇలా..
ABN , First Publish Date - 2021-09-03T23:24:54+05:30 IST
భారత్‌తో జరుగుతున్న రెండో టస్టులో ఇంగ్లండ్ లంచ్ బ్రేక్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఫలితంగా

లండన్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ లంచ్ బ్రేక్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ కంటే 52 పరుగుల దూరంలో నిలిచింది. ఈ ఉదయం 53/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓవర్ నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే క్రెయిగ్ ఒవెర్టన్ (1) అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే డేవిడ్ మలాన్ (31) అవుటయ్యాడు. వీరిద్దరూ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన పోప్, బెయిర్‌స్టోలు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఇధ్దరూ కలిసి సంయమనంతో ఆడుతూ పరుగులు పెంచుతున్నారు. వీరిద్దరూ కలిసి 109 బంతుల్లో 77 పరుగులు జోడించారు. ప్రస్తుతం పోప్ 38, బెయిర్‌స్టో 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.