టోక్యోలో ఎమర్జెన్సీ పొడిగింపు

ABN , First Publish Date - 2021-05-08T09:15:47+05:30 IST

కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టకపోవడంతో జపాన్‌లోని పలు ప్రాంతాల్లో విధించిన అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ఈనెలాఖరు వరకు పొడిగించారు.

టోక్యోలో ఎమర్జెన్సీ పొడిగింపు

టోక్యో: కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టకపోవడంతో జపాన్‌లోని పలు ప్రాంతాల్లో విధించిన అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ఈనెలాఖరు వరకు పొడిగించారు. వైరస్‌ కట్టడికి టోక్యో, ఒసాకా, క్యోటో, హ్యోగో నగరాల్లో విధించిన ఎమర్జెన్సీ ఈనెల 11తో ముగియనుంది. వాటిని పొడిగించడంతోపాటు ఎమర్జెన్సీని ఫ్యుకోకా, ఐచి తదితర ప్రాంతాలకూ విస్తరించారు. ఒలింపిక్స్‌ జూలై 23 నుంచి టోక్యోలో జరగనున్నాయి. 

Updated Date - 2021-05-08T09:15:47+05:30 IST