కనీస సౌకర్యాలు కరువు

ABN , First Publish Date - 2021-01-13T10:13:42+05:30 IST

ఆఖరి టెస్ట్‌ కోసం బ్రిస్బేన్‌ చేరుకున్న టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. బస ఏర్పాటు చేసిన హోట్‌ల్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడం భారత ఆటగాళ్లను షాక్‌కు గురి చేసింది.

కనీస సౌకర్యాలు కరువు

 టీమిండియా ఫిర్యాదు ఫ బీసీసీఐ జోక్యం


బ్రిస్బేన్‌: ఆఖరి టెస్ట్‌ కోసం బ్రిస్బేన్‌ చేరుకున్న టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. బస ఏర్పాటు చేసిన హోట్‌ల్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడం భారత ఆటగాళ్లను షాక్‌కు గురి చేసింది. దీంతో ఆటగాళ్లంతా బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. వెంటనే బోర్డు పెద్దలు రంగంలోకి దిగి క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)తో మాట్లాడారు. ఆ తర్వాత బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా.. తగిన సౌకర్యాలపై ఆటగాళ్లకు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘రూమ్‌ సర్వీస్‌ లేదు. జిమ్‌ దారుణంగా ఉంది. స్విమ్మింగ్‌ పూల్‌లోకి అనుమతి లేదు. ఇలా ఉంటుందని వారు ముందుగా చెప్పలేదు’ అని అక్కడి సమస్యలపై బీసీసీఐ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. 

Updated Date - 2021-01-13T10:13:42+05:30 IST