video viral: ఓడిపోతున్నాననే కోపంలో రాకెట్‌ను నేలకేసి..

ABN , First Publish Date - 2021-08-01T05:20:06+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో టెన్నిస్ స్టార్, ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్ పోరు ముగిసింది. కనీసం ఒక్క పతకం..

video viral: ఓడిపోతున్నాననే కోపంలో రాకెట్‌ను నేలకేసి..

టోక్యో ఒలింపిక్స్‌లో టెన్నిస్ స్టార్, ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్ పోరు ముగిసింది. కనీసం ఒక్క పతకం కూడా లేకుండానే జకోవిచ్ ఇంటిముఖం పట్టాడు. స్పెయిన్ ఆటగాడు పాబ్లో కర్రీనో బుస్తాతో శనివారం  జరిగిన పోరులో జకోవిచ్ ఓటమి చవి చూశాడు. 6-4, 6-7(6-8), 6-3 తేడాతో ఓడిపోయాడు. అయితే ఓడిపోతున్నానే కోపంతో తన రాకెట్‌ను అనేకసార్లు నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా.. జకోవిచ్‌కు గత రెండు రోజుల్లో ఇది మూడో ఓటమి. శుక్రవారం జెర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా జకోవిచ్ ఓడిపోయాడు. దీంతో జకో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

Updated Date - 2021-08-01T05:20:06+05:30 IST