దినేశ్‌ కార్తీక్‌ దంపతులకు కవలలు

ABN , First Publish Date - 2021-10-29T08:34:47+05:30 IST

భారత క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌-స్క్వాష్‌ ప్లేయర్‌ దీపికా పళ్లికల్‌ దంపతులకు ఒకే కాన్పులో ఇద్దరు మగ కవల పిల్లలు జన్మించారు.

దినేశ్‌ కార్తీక్‌ దంపతులకు కవలలు

చెన్నై: భారత క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌-స్క్వాష్‌ ప్లేయర్‌ దీపికా పళ్లికల్‌ దంపతులకు ఒకే కాన్పులో ఇద్దరు మగ కవల పిల్లలు జన్మించారు. ఈమేరకు తన భార్యాపిల్లలతో కలిసి దిగిన ఫొటోను డీకే ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. అలాగే ఈ ఇద్దరు చిన్నారులకు కబీర్‌ పళ్లికల్‌ కార్తీక్‌, జియాన్‌ పళ్లికల్‌ కార్తీక్‌ అనే పేర్లు పెట్టినట్టు చెప్పాడు. మరోవైపు ఈ శుభ సందర్భాన డీకే దంపతులకు క్రికెట్‌ వర్గాల నుంచే కాకుండా ఫ్యాన్స్‌ నుంచి కూడా సోషల్‌ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2021-10-29T08:34:47+05:30 IST