తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. మళ్లీ అతడే..!

ABN , First Publish Date - 2021-05-03T03:35:35+05:30 IST

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 63 పరుగుల వద్ద పృధ్వీ..

తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. మళ్లీ అతడే..!

అహ్మదాబాద్: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 63 పరుగుల వద్ద పృధ్వీ షా(39: 22 బంతుల్లో.. 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. గత మ్యాచ్‌లో ఆర్సీబీపై అదరగొట్టిన హర్ప్రీత్ బ్రార్ వేసిన తొలి బంతికే వికెట్ దక్కించుకున్నాడు. పృధ్వీ షాను క్లీన్ బౌల్డ్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. ప్రస్తుతం శిఖర్ దవన్(23 నాటౌట్: 17 బంతుల్లో.. 4 ఫోర్లు), స్టీవ్ స్మిత్(0) క్రీజులో ఉన్నారు. గెలుపుకోసం ఢిల్లీకి ఇంకా 84 బంతుల్లో 104 పరుగులు చేయాల్సి ఉంది. 

Updated Date - 2021-05-03T03:35:35+05:30 IST