గాళ్‌ఫ్రెండ్‌కు స్టాండ్స్‌లోనే ప్రపోజ్ చేసిన చెన్నై పేసర్ దీపక్ చాహర్

ABN , First Publish Date - 2021-10-08T02:50:22+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్ తన గాళ్

గాళ్‌ఫ్రెండ్‌కు స్టాండ్స్‌లోనే ప్రపోజ్ చేసిన చెన్నై పేసర్ దీపక్ చాహర్

యూఏఈ: ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్ తన గాళ్ ఫ్రెండ్‌కు స్టాండ్స్‌లోనే ప్రపోజ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో దీపక్ నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లి అక్కడ నిల్చున్న తన గాళ్‌ఫ్రెండ్‌కు ఉంగరం ఇస్తూ ప్రపోజ్ చేశాడు.


దీంతో ఆమె తనను తాను నమ్మలేకపోయింది. ఆశ్చర్యచకితురాలైంది. ఆ వెంటనే తేరుకుని ‘యస్’ అంటూ దీపక్‌ను కౌగిలించుకుని సంతోషం వ్యక్తం చేసింది. దీంతో దీపక్ ఆ ఉంగరాన్ని ఆమెకు తొడిగాడు. ఆ వెంటనే ఆమె మరో ఉంగారాన్ని చాహర్‌కు తొడిగింది. చుట్టూ ఉన్న జట్టు సభ్యులు చప్పట్లతో వారిని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. Updated Date - 2021-10-08T02:50:22+05:30 IST