నేటి నుంచి థాయ్‌లాండ్ ఓపెన్
ABN , First Publish Date - 2021-01-12T09:02:26+05:30 IST
నేటి నుంచి థాయ్‌లాండ్ ఓపెన్

బ్యాంకాక్: దాదాపు పది నెలల కరోనా బ్రేక్ తర్వాత భారత ఏస్ షట్లర్లు సైనా, సింధు మళ్లీ బరిలోకి దిగనున్నారు. మంగళవారం ఆరంభమయ్యే యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్‌లో తొలి రౌండ్లో మలేసియా షట్లర్ కిసోనా సెల్వడురేతో సైనా, డెన్మార్క్ ప్లేయర్ మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో సింధు తలపడనున్నారు. వీరిద్దరూ ముందంజ వేస్తే క్వార్టర్స్‌లో ఢీకొనే అవకాశం ఉంది. పురుషుల్లో శ్రీకాంత్, సాయి ప్రణీత్, ప్రణయ్, కశ్యప్ కూడా ఈ టోర్నీలో ఆడనున్నారు.