చివరి టెస్ట్ నుంచి విహారి అవుట్
ABN , First Publish Date - 2021-01-12T09:02:04+05:30 IST
చివరి టెస్ట్ నుంచి విహారి అవుట్

న్యూఢిల్లీ: మూడో టెస్ట్ హీరో హనుమ విహారి కండర గాయంతో ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి విహారి కోలుకొనేందుకు సుదీర్ఘ సమయమే పట్టనుందని తెలుస్తోంది. మూడో టెస్ట్ ముగిసిన అనంతరం విహారికి స్కానింగ్ చేశారు. ఆ రిపోర్టు మంగళవారం రానుంది. ‘విహారి గాయం తీవ్రత స్కానింగ్ నివేదిక వచ్చాకే తెలుస్తుంది. అది గ్రేడ్-1 గాయమైనా అతడు కోలుకొనేందుకు కనీసం 4 వారాలు పడుతుంది. అందువల్ల ఆసీ్‌సతో నాలుగో టెస్ట్‌కేకాదు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీ స్‌కూ విహారి దూరమయ్యే చాన్సుంది’ అని బోర్డు అధికారి వెల్లడించారు. బ్రిస్బేన్ టెస్ట్‌కు విహారి స్థానంలో ఎవరిని తుదిజట్టులోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. గాయపడిన జడేజా స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు చివరి టెస్ట్‌లో చోటు లభించే చాన్స్ ఉంది.