విరుష్క ఇంట మహాలక్ష్మి

ABN , First Publish Date - 2021-01-12T09:01:32+05:30 IST

విరుష్క ఇంట మహాలక్ష్మి

విరుష్క ఇంట మహాలక్ష్మి

ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తండ్రయ్యాడు. అతడి భార్య అనుష్క శర్మ సోమవారం మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరాట్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఈ మధ్యాహ్నం మాకు ఆడపిల్ల పుట్టిందనే విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మీ ప్రేమాభిమానాలు, ప్రార్థనలు, ఆశీస్సులకు కృతజ్ఞతలు. అనుష్క, పసిబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. మేం జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాం. ఈ సమయంలో మా ఏకాంతాన్ని మీరు గౌరవిస్తారని భావిస్తున్నా’ అని కోహ్లీ ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ విరుష్క దంపతులకు సెలెబ్రిటీలు విషెస్‌ తెలిపారు.  

Updated Date - 2021-01-12T09:01:32+05:30 IST