మాస్క్‌ లేకుండా రోడ్డుపైకి..

ABN , First Publish Date - 2021-05-30T09:22:35+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు రాహుల్‌ త్రిపాఠికి పోలీసులు జరిమానా విధించారు. సరైన కారణం లేకుండా రాహుల్‌ కారులో చక్కర్లు కొడుతున్నాడని...

మాస్క్‌ లేకుండా రోడ్డుపైకి..

  • క్రికెటర్‌ త్రిపాఠికి జరిమానా

పుణె: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు రాహుల్‌ త్రిపాఠికి పోలీసులు జరిమానా విధించారు. సరైన కారణం లేకుండా రాహుల్‌ కారులో చక్కర్లు కొడుతున్నాడని, మాస్క్‌ కూడా ధరించలేదని పోలీసులు తెలిపారు. కారులో మరికొందరు కూడా ఉన్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించిన రాహుల్‌కు రూ. 500 జరిమానా వేశామన్నారు. రాహుల్‌ ఆ మొత్తాన్ని చెల్లించాడని చెప్పారు. 


Updated Date - 2021-05-30T09:22:35+05:30 IST