ఒంటికాలిపై అంత ఎత్తుకా?.. రికార్డు సృష్టించిన క్రికెటర్

ABN , First Publish Date - 2021-06-21T12:49:02+05:30 IST

ఒక్క కాలిపై ఎగిరి గంతులేయడం చాలా కష్టం. మన శరీర భారం మొత్తాన్ని ఒక్క కాలిపై లేపడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. అయితే మలేషిజా జాతీయ క్రికెట్ జట్టు సభ్యుడు హరీందర్ సెఖాన్ మాత్రం ఇలా ఒంటి కాలిపై అత్యంత ఎత్తుకు జంప్

ఒంటికాలిపై అంత ఎత్తుకా?.. రికార్డు సృష్టించిన క్రికెటర్

మలేషియా: ఒక్క కాలిపై ఎగిరి గంతులేయడం చాలా కష్టం. మన శరీర భారం మొత్తాన్ని ఒక్క కాలిపై లేపడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. అయితే మలేషిజా జాతీయ క్రికెట్ జట్టు సభ్యుడు హరీందర్ సెఖాన్ మాత్రం ఇలా ఒంటి కాలిపై అత్యంత ఎత్తుకు జంప్ చేశాడు. దీంతో ఒక్క కాలిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తుకు ఎగిరిన వ్యక్తిగా అతను రికార్డు సృష్టించాడు. మలేషియా క్రికెట్ జట్టులో వికెట్ కీపర్‌గా ఉన్న హరీందర్.. ఇలా ఒక్క కాలిపై ఎగురుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను హరీందర్ చదువుకున్న లాఫ్‌బోరో యూనివర్సిటీ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ రికార్డు సృష్టించడం కోసం తాను సుమారు 5 నెలలుగా కష్టపడుతున్నట్లు హరీందర్ వెల్లడించాడు. 

Updated Date - 2021-06-21T12:49:02+05:30 IST