సూపర్ ఫీల్డింగ్‌తో సూర్యకుమార్‌ను అవుట్ చేసిన జోర్డాన్
ABN , First Publish Date - 2021-03-21T08:29:01+05:30 IST
టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ జోర్డాన్ అవుట్ చేసిన తీరు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే జోర్డాన్ ఈ వికెట్ తీసింది బౌలింగ్ చేసి కాదు, ఫీల్డింగ్‌తో.

అహ్మదాబాద్: టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ జోర్డాన్ అవుట్ చేసిన తీరు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే జోర్డాన్ ఈ వికెట్ తీసింది బౌలింగ్ చేసి కాదు, ఫీల్డింగ్‌తో. ఇంగ్లండ్‌తో జరిగిన 5వ చివరి టీ20లో వన్‌డౌన్‌లో దిగిన సూర్యకుమార్ బౌండరీలతో ఇంగ్లిష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. ఆ తర్వాత కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా బంతిని బౌండరీ దాటించే ప్రయత్నం చేశాడు. వైడ్‌స్క్రీన్ వైపుగా సూర్యకుమార్ కొట్టిన భారీ షాట్‌ను పరిగెత్తుకుంటూ వచ్చిన జోర్డాన్ ఒంటిచేత్తో వడిసిపట్టుకున్నాడు. అయితే ఆ వేగాన్ని అదుపు చేసుకోలేక బౌండరీ లైన్ వైపు దూసుకెళ్లాడు. దీంతో అప్పుడే అక్కడకు వచ్చిన ఓపెనర్ జేసన్ రాయ్ వైపు బంతిని విసిరి తాను బౌండరీ దాటేశాడు. ఇలా జేసన్ రాయ్ క్యాచ్ పూర్తి చేయడంతో సూర్యకుమార్ పెవిలియన్ చేరాడు. ఈ అవుట్‌లో జోర్డాన్ ఫీల్డింగును నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.