రాజస్థాన్‌ను చిత్తు చేసిన ధోనీ సేన

ABN , First Publish Date - 2021-04-20T05:12:09+05:30 IST

ధోనీ సేన అన్ని విభాగాల్లో అదరగొట్టింది. రాజస్థాన్ జట్టును మట్టి కరిపించింది. మ్యాచ్ ఆద్యంతమూ శాంసన్ సేన అసలు పోటీనే ఇవ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డు ప్లెసిస్(33), రాయుడు (27), మొయీన్ అలీ (26), బ్రావో (20 నాటౌట్) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో..

రాజస్థాన్‌ను చిత్తు చేసిన ధోనీ సేన

ముంబై: ధోనీ సేన అన్ని విభాగాల్లో అదరగొట్టింది. రాజస్థాన్ జట్టును మట్టి కరిపించింది. మ్యాచ్ ఆద్యంతమూ శాంసన్ సేన అసలు పోటీనే ఇవ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డు ప్లెసిస్(33), రాయుడు (27), మొయీన్ అలీ (26), బ్రావో (20 నాటౌట్) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు ఛేదనలో వెనుకబడింది. టాపార్డర్‌లో బట్లర్ (49) మినహా రాణించలేదు. బట్లర్ తర్వాత ఆ జట్టు బ్యాట్స్‌మెన్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ శాంసన్ (4) పరుగులతో మరోసారి నిరాశ పరిచాడు. ఈ జట్టులో ఉనద్కత్ (24), తెవాటియా (20) దూబే (17) మాత్రమే ఫర్వాలేదనిపించారు.


 చెన్నై స్పిన్నర్ల ధాటికి రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తారు. మొయీన్ అలీ 3, జడేజా 2 వికెట్లతో సత్తా చాటారు. వీరితోపాటు శామ్ కర్రాన్ 2, ఠాకూర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టు.. కేవలం 143 పరుగులే చేయగలిగింది. దీంతో చెన్నై జట్టు 45 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బంతితోపాటు బ్యాటుతోనూ రాణించిన మొయీన్ అలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Updated Date - 2021-04-20T05:12:09+05:30 IST