అక్షర్‌ స్థానంలో శార్దూల్‌

ABN , First Publish Date - 2021-10-14T09:13:46+05:30 IST

టీ20 వరల్డ్‌క్‌పలో పాల్గొనే భారత జట్టులో ఓ మార్పు చోటుచేసుకుంది. ప్రధాన జట్టుగా ఇంతకుముందు ప్రకటించిన 15 మంది బృందంలో అక్షర్‌ పటేల్‌ స్థానంలో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేశారు.

అక్షర్‌ స్థానంలో శార్దూల్‌

భారత టీ20 జట్టులో మార్పు


న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌క్‌పలో పాల్గొనే భారత జట్టులో ఓ మార్పు చోటుచేసుకుంది. ప్రధాన  జట్టుగా ఇంతకుముందు ప్రకటించిన 15 మంది బృందంలో అక్షర్‌ పటేల్‌ స్థానంలో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేశారు. ఈ నెల 17 నుంచి వరల్డ్‌కప్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా జట్లలో మార్పుచేర్పులకు శుక్రవారం తుది గడువు. ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఆడుతున్న శార్దూల్‌ ఆకట్టుకొనే ప్రదర్శన చేస్తున్నాడు. ఫిట్‌నెస్‌ సమస్యలతో పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఐపీఎల్‌లో బౌలింగ్‌ చేయలేదు. అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని జట్టు యాజమాన్యం కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జడేజాకు బ్యాక్‌పగా అక్షర్‌ ఉండనున్నాడు. కాగా, టీమిండియా ప్రాక్టీస్‌కు సహకరించేందుకు బెంగళూరు పేసర్‌ హర్షల్‌ పటేల్‌తోపాటు అవేశ్‌ ఖాన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, వెంకటేష్‌ అయ్యర్‌, కర్ణ్‌ శర్మ, లక్‌మన్‌ మేరివాలా, షాబాజ్‌ అహ్మద్‌, కృష్ణప్ప గౌతమ్‌ బయోబబుల్‌లో చేరనున్నారు. 

Updated Date - 2021-10-14T09:13:46+05:30 IST