టీమిండియాకు అదిరిపోయే ఆరంభం.. బట్లర్ డకౌట్

ABN , First Publish Date - 2021-03-15T00:48:31+05:30 IST

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా శుభారంభం చేసింది. ఒక్క పరుగుకే ఓ వికెట్ తీసుకుని అదరగొట్టింది. తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్.. ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్‌(0)ను డకౌట్‌గా పెవిలియన్‌కు..

టీమిండియాకు అదిరిపోయే ఆరంభం.. బట్లర్ డకౌట్

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా శుభారంభం చేసింది. ఒక్క పరుగుకే ఓ వికెట్ తీసుకుని అదరగొట్టింది. తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్.. ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్‌(0)ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఒక్క పరుగుకే ఓ వికెట్ కోల్పోయింది. కాగా.. మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి టీ20తో పోల్చితే ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా రెండు మార్పులను చేసింది. ఓపెనర్ ధవన్, బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్‌లను తొలగించి ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లను జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. అయితే అందరూ ఆశించినట్లు రోహిత్ శర్మను మాత్రం తీసుకోలేదు.

Updated Date - 2021-03-15T00:48:31+05:30 IST