కోహ్లీ డకౌట్‌పై బౌలర్ రియాక్షన్

ABN , First Publish Date - 2021-03-14T11:05:30+05:30 IST

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఒక్క పరుగు కూడా చేయకుండానే కోహ్లీని పెవిలియన్ చేర్చింది ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్.

కోహ్లీ డకౌట్‌పై బౌలర్ రియాక్షన్

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఒక్క పరుగు కూడా చేయకుండానే కోహ్లీని పెవిలియన్ చేర్చింది ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్. ఇలా కోహ్లీని సున్నాకే అవుట్ చేయడంపై రషీద్ నోరువిప్పాడు. కోహ్లీ వంటి ప్రపంచ స్థాయి ఆటగాడిని ఇలా డకౌట్ చేయడం అద్భుతంగా అనిపించిందని చెప్పాడు. కోహ్లీ రావడానికి ముందు ప్రేక్షకులు ఎలా ఉంటారో తనకు తెలుసని, ఇలాంటి గొప్ప ఆటగాళ్లను త్వరగా అవుట్ చేస్తే ప్రేక్షకులను కూడా సైలెంట్‌గా ఉంచొచ్చని అన్నాడు. ఈ మ్యాచులో మూడు ఓవర్లు వేసిన రషీద్.. కేవలం కోహ్లీని మాత్రమే అవుట్ చేయడం గమనార్హం.

Updated Date - 2021-03-14T11:05:30+05:30 IST