భువనేశ్వర్‌కు పితృ వియోగం

ABN , First Publish Date - 2021-05-21T05:43:29+05:30 IST

టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తండ్రి కిరణ్‌ పాల్‌ సింగ్‌ (63) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు.

భువనేశ్వర్‌కు పితృ వియోగం

న్యూఢిల్లీ: టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తండ్రి కిరణ్‌ పాల్‌ సింగ్‌ (63) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. గత ఎనిమిది నెలలుగా ఆయన లివర్‌ కేన్సర్‌తో బాధపడుతున్నారు. రెండు వారాల క్రితం పరిస్థితి విషమించడంతో మీరట్‌లోని ఆసుపత్రికి తరలించారు. గత మంగళవారం డిశ్చార్జ్‌ చేయగా.. ఇంటికి చేరిన రెండు రోజుల తర్వాత మృతి చెందారు.

Updated Date - 2021-05-21T05:43:29+05:30 IST