దక్షిణాఫ్రికా గెలుపుతో సెమీస్ రేసు నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్, శ్రీలంక

ABN , First Publish Date - 2021-11-03T02:54:01+05:30 IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ రోజు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాప్రికా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం

దక్షిణాఫ్రికా గెలుపుతో సెమీస్ రేసు నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్, శ్రీలంక

అబుదాబి: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ రోజు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 84 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.


ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఆరు పాయింట్లతో గ్రూప్ 1లో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓటమి పాలైన బంగ్లాదేశ్ సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకుంది.  అలాగే, నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో ఓడిన శ్రీలంక కూడా సెమీస్ రేసు నుంచి అవుటైంది.

Updated Date - 2021-11-03T02:54:01+05:30 IST