నిద్ర కూడా పట్టలేదు.. నోరు విప్పిన స్మిత్!

ABN , First Publish Date - 2021-01-14T01:53:03+05:30 IST

సిడ్నీ టెస్టు నాలుగో ఇన్నింగ్స్ సమయంలో వికెట్ వద్ద రిషభ్ పంత్ పెట్టుకున్న గార్డ్ మార్క్‌ను ఆసీస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ చెరిపేస్తూ కనిపించిన వీడియో పెద్ద దుమారమే రేపింది.

నిద్ర కూడా పట్టలేదు.. నోరు విప్పిన స్మిత్!

సిడ్నీ: సిడ్నీ టెస్టు నాలుగో ఇన్నింగ్స్ సమయంలో వికెట్ వద్ద రిషభ్ పంత్ పెట్టుకున్న గార్డ్ మార్క్‌ను ఆసీస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ చెరిపేస్తూ కనిపించిన వీడియో పెద్ద దుమారమే రేపింది. అయితే స్మిత్.. పంత్ పెట్టుకున్న మార్క్‌ను చెరపలేదని, అతను ప్రతి మ్యాచులోనూ ఇలాగే చేస్తాడని అతని సహచర ఆటగాళ్లు చెప్పారు. ఆసీస్ కోచ్ లాంగర్ కూడా స్మిత్‌కు అండగా నిలిచాడు, గార్డ్ మార్క్ చెరిపినట్లు స్మిత్‌పై వచ్చిన విమర్శలను ఆయన ఖండించారు. ఈ క్రమంలో తనపై వస్తున్న ఈ విమర్శలపై స్మిత్ పెదవి విప్పాడు. ఈ విమర్శలు తనను షాక్‌కు గురిచేశాయని అతను అన్నాడు. ఈ గొడవ తనను చాలా నిరాశకు గురిచేసిందని, సరిగా నిద్ర కూడా పట్టలేదని స్మిత్ బాధపడ్డాడు. మామూలుగా ప్రతి మ్యాచులోనూ తాను బ్యాటింగ్ చేస్తున్నట్లు ఊహించుకోవడం కోసం వికెట్ల దగ్గరకు వెళ్తానని, ఆ సమయంలో అలవాట్లో పొరపాటుగా మధ్యలో ఓ మార్క్ పెట్టుకుంటానని స్మిత్ వివరణ ఇచ్చాడు. స్మిత్ చేసిన పని క్రికెట్ స్పిరిట్‌కు విఘాతం కలిగించేలా ఉందంటూ చాలా మంది అతన్ని తిట్టిపోస్తున్న విషయం తెలిసిందే. మరి స్మిత్ స్వయంగా వివరణ ఇచ్చిన తర్వాతైనా ఈ విమర్శలు చల్లబడతాయేమో చూడాలి.

Updated Date - 2021-01-14T01:53:03+05:30 IST