బంగ్లా భారీ విజయం

ABN , First Publish Date - 2021-07-12T09:03:09+05:30 IST

జింబాబ్వేతో ఏకైక టెస్ట్‌లో పర్యాటక బంగ్లాదేశ్‌ 220 రన్స్‌తో ఘన విజయం సాధించింది. 477 పరుగుల ఛేదనలో చివరి రోజైన ఆదివారం జింబాబ్వే 256 రన్స్‌కే

బంగ్లా భారీ విజయం

హరారే: జింబాబ్వేతో ఏకైక టెస్ట్‌లో పర్యాటక బంగ్లాదేశ్‌ 220 రన్స్‌తో ఘన విజయం సాధించింది. 477 పరుగుల ఛేదనలో చివరి రోజైన ఆదివారం జింబాబ్వే 256 రన్స్‌కే కుప్పకూలింది. ఓవర్‌నైట్‌ స్కోరు 140/3తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన జింబాబ్వే మరో 116 పరుగులే జోడించగలిగింది. బ్రెండన్‌ టేలర్‌ (92), తిరిపనో (52) పోరాడారు. మెహ్దీ హసన్‌ మిరాజ్‌, తస్కిన్‌ అహ్మద్‌ చెరి 4 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 468, జింబాబ్వే 276 రన్స్‌ చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 284/1 (డిక్లేర్‌) స్కోరు సాధించింది. 

Updated Date - 2021-07-12T09:03:09+05:30 IST