ఆస్ట్రేలియా బ్యాండ్ బజాయించి వచ్చాం: రవిశాస్త్రి

ABN , First Publish Date - 2021-02-06T00:21:33+05:30 IST

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సాధించిన టెస్టు సిరీస్ విజయంపై భారత జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి కాస్తంత వెరైటీగా

ఆస్ట్రేలియా బ్యాండ్ బజాయించి వచ్చాం: రవిశాస్త్రి

చెన్నై: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సాధించిన టెస్టు సిరీస్ విజయంపై భారత జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి కాస్తంత వెరైటీగా స్పందించాడు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ వంటి ఆటగాళ్లను కలిగిన కంగారూ జట్టును ముఖ్యమైన ఆటగాళ్లు లేకుండానే బ్యాండ్ బజాయించి వచ్చినట్టు పేర్కొన్నాడు. అడిలైడ్ టెస్టులో ఘోర పరాభవం తర్వాత అనూహ్యంగా పుంజుకున్న భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఫలితంగా ఆస్ట్రేలియా గడ్డపై రెండు వరుస సిరీస్‌‌లను గెలుచుకున్న జట్టుగా రికార్డులకెక్కింది. 2018/19లోనూ భారత జట్టు 2-1 తేడాతోనే ఆస్ట్రేలియాను మట్టికరిపించింది.


అయితే, అప్పటి జట్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం వల్లే భారత జట్టు విజయాన్ని అందుకోగలిగిందన్న విమర్శలు ఉన్నాయి. బాల్ ట్యాంపరింగ్ కారణంగా వారు అప్పుడు జట్టుకు దూరమయ్యారు. తాజాగా స్పోర్ట్స్ చానల్‌తో మాట్లాడిన రవిశాస్త్రి.. ఎవరికైనా ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించడం కష్టమని పేర్కొన్నాడు.  గతంలో తాము ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు స్మిత్, వార్నర్ వంటి వారు లేరని అన్నారని, ఇప్పుడు వారిద్దరూ జట్టులో ఉన్నప్పటికీ వారి బ్యాండ్ బజాయించి వచ్చామని రవి చెప్పుకొచ్చాడు.  

Updated Date - 2021-02-06T00:21:33+05:30 IST