అజర్, అబిద్ శతకాలు
ABN , First Publish Date - 2021-05-08T09:28:45+05:30 IST
జింబాబ్వేతో ఆఖరి, రెండో టెస్ట్‌లో పర్యాటక పాకిస్థాన్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.

పాక్ 268/4...
హరారే: జింబాబ్వేతో ఆఖరి, రెండో టెస్ట్‌లో పర్యాటక పాకిస్థాన్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. అజర్ అలీ (126), అబిద్ అలీ (118 బ్యాటింగ్) సెంచరీలతో విజృంభించడంతో.. మొదటి రోజైన శుక్రవారం ఆట చివరకు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 268 పరుగులు సాధించింది. బ్లెసింగ్ ముజరబాని (3/41) మూడు వికెట్లు పడగొట్టాడు.