ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో
ABN , First Publish Date - 2021-11-21T08:30:26+05:30 IST
వరల్డ్ నంబర్ వన్ జొకోవిచ్ లాంటి ఆటగాళ్లకు భారీషాక్. కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసే ప్రక్రియలో భాగంగా ప్లేయర్లకు వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన తొలి గ్రాండ్‌స్లామ్‌గా ఆస్ట్రేలియన్ ఓపెన్ నిలిచింది. వచ్చే ఏడాది జనవరి

నో వ్యాక్సిన్.. నో ఎంట్రీ
జొకోవిచ్ ఆడడంపై అనుమానాలు
మెల్‌బోర్న్: వరల్డ్ నంబర్ వన్ జొకోవిచ్ లాంటి ఆటగాళ్లకు భారీషాక్. కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసే ప్రక్రియలో భాగంగా ప్లేయర్లకు వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన తొలి గ్రాండ్‌స్లామ్‌గా ఆస్ట్రేలియన్ ఓపెన్ నిలిచింది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 30 వరకు జరిగే సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో బరిలోకి దిగాలంటే.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో 9సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ జొకోవిచ్ బరిలోకి దిగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తప్పనిసరి వ్యాక్సినేషన్‌ను జొకో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఒకవేళ అలాంటి రూల్స్‌ను తీసుకువస్తే.. వైదొలగుతానని గతంలో ప్రకటించాడు. ‘ప్రతి ఒక్కరికీ నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ ఉండాలి. శరీరంలోకి ఏదైనా తీసుకొనేటప్పుడు నిర్ణయాధికారం మరింత స్వతంత్రంగా ఉండాలి’ అని ఓ టోర్నీ సందర్భంగా జొకో అన్నాడు. గతంలో కఠిన క్వారంటైన్ నిబంధనలను కూడా నొవాక్ వ్యతిరేకించాడు. అయితే, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోపాల్గొనేఆటగాళ్లతోపాటు సహాయ సిబ్బంది, ఫ్యాన్స్ కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ ప్రోగ్రామ్ సందర్భంగా టోర్నమెంట్ డైరెక్టర్ క్రెయిగ్ టిలే ప్రకటించాడు. జొకో కూడా వ్యాక్సిన్ తీసుకొనే టోర్నీ బరిలోకి దిగుతాడనే ఆశాభావాన్ని టిలే వ్యక్తం చేశాడు.